సెకండ్ ఇన్నింగ్స్ లో నయనతార హవాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. చిన్న, పెద్ద హీరోయిన్లతో తేడా లేకుండా అందరితోనూ నటిస్తూ హిట్ల హిట్లు కొట్టేస్తుంది. ప్రస్తుతం ఆమెకిచ్చే పారితోషకంతో ఓ చిన్న బడ్జెట్ తీయొచ్చనే గుసగుసలు వినిస్తున్నాయి. కోలీవుడ్ తోపాటు ఏ మాత్రం వీలు దొరికినా ఆమె తెలుగు .. మలయాళం చిత్రాలను కూడా అంగీకరిస్తూ వెళుతోంది.
ఇక తాజాగా మళయాళ స్టార్ మమ్ముట్టితో కలిసి ఆమె నటించిన మలయాళం సినిమా 'పుతియ నియమం' అక్కడ విజయభేరీ మోగిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భాస్కర్ ది రాస్కెల్' చిత్రం సూపర్ హిట్ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఎ.కె.సాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి లాయర్ పాత్రను పోషించగా, ఆయన భార్య పాత్రలో నయనతార నటించింది. ఈ పాత్రలో ఆమె నటన అపూర్వం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాతో ఆమె మలయాళంలోను మరింత బిజీ కావడం ఖాయం.