బాత్ రూం సీన్ కోసం తిప్పలుపెట్టిన నటి

February 19, 2016 | 05:34 PM | 4 Views
ప్రింట్ కామెంట్
samantha troubles trivikram for bathroom scene in A Aa niharonline

ఎడిటింగ్ లో తీసేశారే కానీ అత్తారింటికి దారేది బాత్ రూం సీన్ లో టవల్ లో సమంత కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిందని తెలిసిందే. ఎంతలా అంటే ఇంటర్నెట్ లో పెట్టిన ఈ సీన్ ను ఫ్యాన్స్ దెబ్బకి సినిమాకి కలిపాడు త్రివిక్రమ్. ఇంక మరోసారి త్రివిక్రమ్ కోసం బాత్ రూం సీన్ లో నటించేందుకు సిద్ధమౌతోంది సమంత.

                                         ప్రస్తుతం అ.ఆ... లో కూడా ఓ బాత్ రూం సీన్ ఉండబోతుందట. త్రివిక్రమ్ కోరిక మేరకు ఆ సీన్ లో టవల్ లో హాట్ హాట్ గా నటించేందుకు సమంత సిద్ధమయ్యింది. కానీ, ఓ హోటల్ బాత్ రూంలో ఈ సీన్ ను తీసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట. కానీ, అందుకు సామ్ ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో చచ్చినట్లు అక్కడే ఓ బాత్ రూం సెట్ వేయించాడంట త్రివిక్రమ్. హీరోయిన్లకు హోటళ్లలో ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో గతంలో మనం చూశాం. ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో ఓ హోటల్ బాత్ రూంలో స్నానం చేస్తుండగా వీడియో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే హోటల్ గదుల్లో షూటింగ్ కి దాదాపు హీరోయిన్లంతా షూటింగ్ కి కానీ, స్టే చేయటానికి గానీ ఓకే చెప్పడం లేదు. ఏదైతేనేం అ..ఆ... లో ఉండబోయే బాత్ రూం సీన్ మాత్రం చాలా రొమాంటిక్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ప్చ్... ఈ టవల్ రొమాన్స్ కోసం సమ్మర్ దాకా ఆగాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ