నితిన్ నిజంగా అమాయకుడు....

October 16, 2015 | 05:07 PM | 3 Views
ప్రింట్ కామెంట్
akhil-fans-fire-nithin-vvvinak-niharonline

అఖిల్ సినిమా ఆగిపోవడంతో... తప్పు నిర్మాత నితిన్, డైరెక్టర్ వివివినాయక్ మీదకు తోసి కొందరు ఆందోళనకు దిగారు. అక్టోబర్ 22న విడుదల కావాల్సిన అఖిల్ మూవీని వాయిదా వేయడంతో నెల్లూరు జిల్లా నాగ్ అండ్ అఖిల్ ఫ్యాన్స్ నితిన్ మీద గుర్రుగా ఉన్నారు. ఫ్లెక్సీలు పట్టుకుని మరీ ఆందోళన చేశారు. కానీ నితిన్ చేతిలో ఏమైనా ఉందా? సినిమా వాయిదా పడకూడదని చివరి నిమిషం వరకూ కోరుకున్న అమాయక నిర్మాత నితిన్. ఈ సినిమా కోసం ఇప్పటికే బోలెడు ఖర్చు పెట్టి ఎంతో శ్రమకోర్చాడు. సినిమా వాయిదా వేయాలని ఏ నిర్మాతకు మాత్రం ఉంటుంది. ఇప్పటికే ఏరియాల వైజ్ గా ఈ సినిమా అమ్మకాలు జరిగిపోయాయి. ఒక పక్క ఆ రోజు రిలీజ్ ఆపితే 70 % మాత్రమే చెల్లిస్తామని బయ్యర్లు చెప్పారు కూడా. అయినా వాయిదా వేశారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేశారో ఫాన్స్ గమనించాలి. నితిన్ ట్వీట్ చేస్తే అది ఒక్కడి డెషిషన్ ఎలా అవుతుంది? 
ఆ యూనిట్ అందరిదీ అవుతుంది. గ్రాఫిక్ వర్క్ కారణంగా ఇలా జరిగిందంటున్నారు. నాగ్ ఫ్యాన్స్ నితిన్ ని నమ్మక ద్రోహి అనడం, దర్శకుడిని కుట్రదారుణ్ణి చేయడం ఏమిటి? ఆ సినిమా వాయిదా పడితే ఎవరికి నష్టం. నితిన్ కే మరి వాయిదా పరిస్థితికి కారణం చూడాలి గానీ ఫాన్స్ ఇలా బహరింగంగా దుమ్మెత్తి పోయడమేంటి? పాపం నిర్మాతగా మొదటి సినిమాకే చిక్కుల్లో పడిపోయాడు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ