కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మహేష్ బాబు మూవీపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో అంతకుముందే జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, అత్తగా శ్రీదేవి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త వెలుగు చూస్తోంది. ఓ సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి నటిస్తున్నట్టు సమాచారం. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. గతంలో నెపోలియన్ చాలా తెలుగు సినిమాల్లో నటించాడు. యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా పనిచేశాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఈ నటుడ్ని దర్శకుడు సంప్రదిస్తే ఓకే చేసినట్టు తెలుస్తోంది. నెపోలియన్ నటించడం వల్ల ఈ చిత్రం తమిళ డబ్బింగ్‌కి మంచి రేట్ వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు తెలుగు ఫిల్మ్ నగర్ లో చర్చలు సాగుతున్నాయి.