టాలీవుడ్ కుర్ర హీరోలను మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే కొంత మంది హీరోల పేర్లు చెప్తారు కానీ, ఎందుకిష్టమంటే మాత్రం సరైన వివరణ ఇవ్వలేక తడబడుతుంటారు. కానీ, హీరో నిఖిల్ అలా కాదు. సినీ పరిశ్రమలో తనకు ప్రేరణ ఎవరంటే పవన్, రవితేజ అని చెప్పి వారంటే ఎందుకిష్టమో కూడా వివరణ ఇస్తాడు. కార్తీకేయ హిట్ తో ఊపుమీదున్న ఈ హీరో ఇటీవల ట్విట్టర్లో తన అభిమానులతో ఈ విషయమై వివరణ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్రహీరో అయినప్పటికీ ఎలాంటి అర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఉంటారని అందుకే ఆయనంటే ఇష్టమట. తనను తాను తరచు మాస్ మహారాజాతో పొల్చుకునే నిఖిల్ ఎలాంటి ఇండస్ర్టీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ రవితేజ తన సొంత శక్తి సామర్థ్యాలతో కష్టపడి పైకి వచ్చాడని పొగిడాడు. అందుకే వారిద్దరంటే తనకు పిచ్చిపిచ్చిగా ఇష్టమని, వాళ్లే తనకు ప్రేరణ అని చెప్పుకోచ్చాడు. సో.. ఎప్పుడూ సినిమాల్లో వీరిద్దరిని అనుకరించే ఈ యంగ్ హీరోకు ఆ మేనరిజమే ఫ్లస్ అయి హిట్లు అందిస్తుందన్న మాట.