హ్యాపీడేస్ అనంతరం ఏవో కొన్ని చిత్రాలు చేసిన నిఖిల్ పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయాడు. కానీ కార్తికేయ, స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో డిఫరెంట్ చిత్రాల జోనర్ లోకి వెళ్ళిపోయాడు. సినిమాలు, కథల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు విడుదల కాబోయే "శంకరాభరణం" కూడా మంచి టేస్ట్ ఉన్న రైటర్ కోన సొంతంగా నిర్మిస్తున్న చిత్రమిది. అది కూడా హిట్ అవుతుందనే టాక్ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో చిత్రానికి రెడీ అయ్యాడు ఈ హీరో. ఈ చిత్రం మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వర్రావు తన మొదటి చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి.. టైగర్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైతన ప్రతిభను ఘనంగా చాటుకున్న యువ ప్రతిభాశాలి "వి.ఐ.ఆనంద్" దర్శకత్వం వహిస్తున్నారు.
విజయదశమి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ చిత్రం టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారు.
చిత్ర నిర్మాత-మేఘన ఆర్ట్స్ అధినేత పి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. "టైగర్" చిత్రంతో విజయం సాధించిస్క్రీన్ ప్లే పరంగా కొత్తదనాన్ని ఆవిష్కరించిన వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తనదైన శైలిలో సరికొత్త కధలని ఎంచుకునే హీరో నిఖిల్ ఈ కధని సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకె చేసారు. సాయిశ్రీరాంఅబ్బూరి రవిశేఖర్చంద్రచోటా కే ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ టేక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక పూర్తి చేసి.. నవంబర్ చివరిలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం " అన్నారు.