బాలీవుడ్ నుంచి దిగొచ్చిన ‘కిక్ 2’ విలన్

January 31, 2015 | 05:34 PM | 34 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ లోకి పరభాషా హీరోయిన్ల ప్రభంజనం బాగా ఉన్నట్టే, విలన్లను కూడా అక్కడినుంచే అరువు తెచ్చుకుంటున్నారు. రవితేజ-సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో ఇంతకు ముందు ’కిక్’ సినిమాలోనూ కోలీవుడ్ నటుడు శ్యామ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ’కిక్ 2’ లోనూ పరభాషా నటుల సంఖ్య ఎక్కువే నట. అయితే ఈ సినిమా మెయిన్ విలన్ ని మాత్రం బాలీవుడ్ లోంచి తీసుకు వచ్చారు. ఈ నాటుడు ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో విలన్ గా నటించిన నికితిన్ ధీర్. ఈయనతో పాటు మరో ఇద్దరు విలన్లు కూడా నటిస్తున్నారట. వారెవరో కాదు ‘రేసుగుర్రం’ చిత్రంలో పరిచయమైన భోజ్ పురి నటుడు రవికిషన్, విక్రమ్ సింగ్ సపోర్టింగ్ విలన్స్ గా చేస్తున్నారట. మరో విశేషమేమంటే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా గెస్ట్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇక ఇందులో హాస్య నటుడిని కూడా బాలీవుడ్ నుంచే అరువు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. కిక్ 2’ షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఇటీవలే విడుదలైన ‘కిక్ 2’ ఫస్ట్ లుక్ టీజర్ చాలా బాగుందని ఆడియన్స్ టాక్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాన్ రామ్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ