మనస్పర్థలతోనే సినిమా ఆగిపోయిందా?

June 11, 2015 | 11:54 AM | 0 Views
ప్రింట్ కామెంట్
nithin_puri_movie_cancelled_niharonline

జ్యోతి లక్ష్మీ చిత్ర షూటింగ్ దశలో ఉండగానే నితిన్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్. నితిన్ కూడా హృదయాన్ని తట్టే ప్రేమకథ పూరితో ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. అంతే కాదు జూన్ 15 నుంచి ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ఉంటుందని చెప్పేశాడు. చిరంజీవితో సినిమా షూటింగ్ కి మూడు నెలల గ్యాప్ ఉండటంతో ఎలాగూ చుట్టేయ్యోచ్చు లే అనుకున్నారేమో ఆ ఇద్దరు. అయితే అనివార్య కారణాల వల్ల పూరి నితిన్ చిత్రం ఆగిపోయిందట. ఈ విషయాన్ని నితిన్, పూరి ఇద్దరు చెప్పేశారు. ఇదే కథ మరో హీరోతో అదే తేదీలో షూటింగ్ ప్రారంభమౌతుందని పూరి చెప్పాడు. ఫిలింనగర్ సమాచారం ప్రకారం అది మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అని వినిపిస్తుంది. కానీ, సినిమా ఆగిపోవటానికి గల కారణాలేంటో అటు నితిన్ గానీ, ఇటు పూరి గానీ చెప్పకపోవటం గమనార్హం. ఇక నితిన్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్ ఎంటో మాత్రం స్పష్టం చెయలేకపోయాడు. వారిద్దరి మధ్య మనస్పర్థలే సినిమా ఆగిపోవటానికి కారణమని ప్రస్తుతం గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా హర్ట్ అటాక్ తర్వాత మరో ప్రేమకథ తో మన ముందుకు వస్తారనుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ ఆగిపోవటం కాస్త బాధాకరమే. కానీ, భవిష్యత్ లో వీరి సినిమా తప్పక ఉంటుందని నితిన్ చెప్పటం కాస్త ఊరటనిచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ