నిత్యామీనన్ ఇప్పటి వరకూ నటించిన సినిమాలన్నీ మంచి కథలూ, చక్కని ఎంటర్ టైన్ మెంట్ ఉన్నవి. దాదాపు అన్నీ సక్సెస్ మూవీలే. తన సినిమాలను ఎంచుకునే విధానంలో చాలా తెలివి ప్రదర్శిస్తుందనేది అర్థ మవుతోంది. సినిమా ఒప్పుకోయేముందు తన పాత్ర గురించి హీరోతో ముద్దు సీన్ల వంటివి ఉన్నాయా? అని ముందుగానే అడుగుతుందట. ఇలా అడిగితే పొగరనీ, సినిమా ఛాన్సులు రావని అనుకునే వాళ్ళూ ఉన్నారు. సినిమా ఛాన్సుల కోసం జిమ్మిక్కులు చేయడం, కాకాలు పట్టడం తనకు చేత కాదు. ఇక్కడే తనదో ప్రత్యేక వ్యక్తిత్వం అనేది అర్థం చేసుకోవచ్చు. తనకు నచ్చితేనే నటిస్తుంది. సినిమా అవకాశాల కోసం వెంపర్లాడ్డం ఉండదు. తను సూటిగా మాట్లాడ్డంపై అంతకు ముందు కొందరు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు ’మళ్ళీ మళ్ళీ రాని రోజు’ సినిమాపై శభాష్ అంటున్నారు కూడా. ఇందులో తన నటన శర్వానంద్ ను కూడా బీట్ చేసేసిందట. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నిటికీ చాలా డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమాలో నిత్య పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని మెచ్చకుంటున్నారు క్రిటిక్స్. అయితే ఈ మధ్య తనకు డైరెక్షన్ అంటే ఇష్టమని అంటోంది. మగధీర, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు తనకు బాగా నచ్చాయనీ, వీలయితే అలాంటి సినిమాలకు దర్శకురాలినవుతానని అంటోంది. ఆమె ఇప్పుడు నవలలు బాగా చదివేస్తోందట. పనిలో పనిగా కలం పట్టుకుని కథలు కూడా రాసేస్తుందట. ఇక త్వరలో దర్శకత్వంలో అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదన్నమాట.