దర్శకుడిగా మారిన రచయిత అనిల్ రావిపూడి తొలిచిత్రం పటాస్ తోనే మంచి హిట్ సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా హీరో కళ్యాణ్ రామ్ కంటే ఇతనికే ఎక్కువగా పేరు తెచ్చింది. దీంతో పలువురు హీరోల నుంచి అతనికి ఆఫర్ల వెల్లువ వస్తుందట. అయితే ఊహించని పిలుపు ఒకటి ఇప్పుడతని ఊపిరాడకుండా చేస్తుందని సమాచారం. అదేక్కడి నుండో కాదండోయ్ స్వయానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి. తనను కలిసి ఓ కథ చెప్పాల్సిందిగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి అనిల్ ను కోరాడట. దీంతో ఆ దర్శకుడు ఉబ్బితబ్బిబి అయిపోతున్నాడని సమాచారం. స్వతహాగా నూతన దర్శకులను పవర్ స్టార్ ప్రొత్సహిస్తూనే ఉంటాడు. ఇప్పటికే పవర్ ఫేం బాబీ ని గబ్బర్ సింగ్-2 కు దర్శకత్వం వహించాడానికి ఆహ్వానించిన పవన్ ఇప్పడీ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడట. దీంతో పవన్ కోసం పవర్ ఫుల్ కథను తయారు చేసే పనిలో ఉన్నాడట ఈ లక్కీ డైరక్టర్.