ఈ బొద్దుగుమ్మ పెర్ఫార్మెన్స్ ఎంతో ముద్దు

February 07, 2015 | 03:45 PM | 32 Views
ప్రింట్ కామెంట్
nityamenon_mallimalli idi raniroju_niharonline

ఇప్పుడు సినిమా అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం అన్నట్టుంది. ఇందులో పెర్ఫార్మెన్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా ’మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా గ్లామర్ కు దూరమనే చెప్పాలి. కానీ నిజమైన అందంగల హీరో, హీరోయిన్లు వీరిద్దరూ. నిత్యానటనను సావిత్రితో పోల్చాడు హీరో శర్వానంద్. ఆ మహానటిని పోల్చదగిన వారు ఇంకా పుట్టలేదు గానీ, నిత్యామీనన్ మాత్రం బొద్దయిన ముద్దుగుమ్మ. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇప్పుడున్న హీరోయిన్లకు పై స్థాయిలోనే ఉంటుంది. మొదటి సినిమా ‘అలా మొదలైంది’లో కూడా చాలా మెచ్యురిటీగా నటించింది. ఆ తరువాత కూడా గ్లామర్‌ జోలికి వెళ్ళకుండా, నటనకే ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఏ సినిమా చేసినా, ఆ మూవీ రిజల్ట్‌ కి అతీతంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నితిన్‌కి లక్కీ హీరోయిన్‌గా నిత్యామీనన్‌ మారినప్పటినుంచీ ఆమె ఇమేజ్‌ రెట్టింపయ్యింది. పూర్తిగా డెడికేషన్ తో చేస్తుంది ఏ సినిమా అయినా. కథ గురించిగానీ, హీరోల గురించి గానీ పట్టించుకోదు. తనకు ఇచ్చిన పాత్రకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలో కూడా నిత్యా మీనన్‌ చాలా బాగా నటించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హీరో హీరోయిన్లు ఇద్దరూ పోటాపోటీగా నటించారు. అవకాశాలు రావాలే గానీ గ్లామర్‌ అవసరమే లేదని నిత్యామీనన్‌ ఈ సినిమాలోనూ నిరూపించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ