సర్దార్ బ్రహ్మీకి బ్రేక్ ఇస్తాడా?

March 19, 2016 | 12:37 PM | 5 Views
ప్రింట్ కామెంట్
brahmi-role-in-pawan kalyan sardar-niharonline

సీనియర్ కమెడియన్ బ్రహ్మనందంకి గతకొంతకాలంగా టైం బాగోలేదు. అన్నీ మూస పాత్రలతో విసిగిస్తున్నాడని సగటు ప్రేక్షకుడే కాదు సీనియర్ కమెడియన్లు కూడా బ్రహ్మీ పై విసుర్లు విసురుతున్నారు. నటుడిగా రాణించాలనే అనుకోవాలి తప్పించి, డామినేషన్ ఉండాలనుకోవటం మంచిది కాదని కోటలాంటి నటులు బహిరంగంగానే బ్రహ్మీకి క్లాస్ పీకారు కూడా. దీనికి తోడు ప్రస్తుతం బ్రహ్మీ చేతుల్లో ఉంది చాలా తక్కువ సినిమాలు. దీంతో ఎలాగైనా ఫాంలోకి రావాలని చూస్తున్నాడు ఈ గిన్నిస్ రికార్డ్ హోల్డర్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ కూడా ఒకటి ఉంది.

                                  ముఖ్యంగా పవన్బ్-బ్రహ్మీ కాంబినేషన్లో కామెడీ అనగానే జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు గుర్తోస్తాయి. ఆయా చిత్రాల్లో వీరిద్దరు కలిసి చేసిన సందడిని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అందుకే 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో బ్రహ్మానందం కోసం ప్రత్యేక కేర్ తీసుకున్నాడంట పవన్. ప్రత్యేకంగా సీన్లను రాయించి, అవి బాగా వచ్చేదాకా తీయించి దగ్గరుండి మరీ ఎడిటింగ్ చేయిస్తున్నాడంట.  రాజ్ పుత్ రైఫిల్స్ పేరుతో తుపాకులు అమ్మే ఓ దుకాణాన్ని నడిపే ఓనర్ గా బ్రహ్మీ అలరిస్తాడని, పవన్ తో కలిసి ఆయన చేసే సందడి ఆకట్టుకుంటుందని టీం చెబుతోంది. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు గత చిత్రాల కన్నా అద్భుతంగా వన్స్ మోర్ అనిపించేలా ఉంటాయని సమాచారం. మరీ ఆ హడావుడి ఏంటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ