బాలీవుడ్‌లో మరింతగా అందాలు ఆరబోసేందుకు సన్నీలియోన్ రెడీ అయ్యింది. 1990ల్లో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సెక్స్ బాంబ్ మమతా కులకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రాబోతోంది. ఇందులో మమత రోల్‌కి సన్నీని తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తనకంటూ బాలీవుడ్‌లో ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న మమతాకులకర్ణి.. రీసెంట్‌గా డ్రగ్ కేసులో కెన్యాలో అడ్డంగా దొరికిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత కథ ఆధారంగా మూవీ చేయబోతున్నట్లు ఫోటోగ్రాఫర్ జయేష్‌షేథ్ ఇటీవలే ప్రకటించాడు. మమతా పాత్రకు సన్నీలియోన్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సన్నీ అయితే ఈ రోల్‌కి న్యాయం చేస్తుందని తాను భావిస్తున్నట్లు మనసులోనిమాట బయటపెట్టాడు. స్క్రిప్టు పూర్తయ్యాక మాట్లాడతానని తెలిపాడు. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కావచ్చని అంటున్నాడు. అంతేకాదు సన్నీని కులకుర్ణి మాదిరిగా అందంగా వెండితెరపై చూపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్.