నాభి చూపించనంటున్న నిత్య

March 31, 2015 | 04:13 PM | 76 Views
ప్రింట్ కామెంట్
nityamenon_allu_sun_of_satyamurthy_niharonline

హీరోయిన్ల స్ట్రాటజీ ఒకొక్కరిదీ ఒక్కో రకం. కొందరు అందాలు ఆరబోస్తే ఆఫర్లు వస్తాయనుకుంటుంటారు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే తాము నటించడానికి రెడీ...అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి సమర్థించుకునే వారూ ఉంటారు. హీరోయిన్ల అందాల ఆరబోతతో కాసులు పండించకునే నిర్మాతలూ దర్శకులూ ఉన్నట్టే, కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే చూసే వాళ్ళూ ఉంటారు. అలాంటి క్లాస్ సినిమాలూ ఉంటూనే ఉన్నాయి. కె.విశ్వనాథ్, శేఖర్ కపూర్, నందినీరెడ్డి లాంటి కొందరు డైరెక్టర్లు కథాపరంగా హిట్స్ ఇస్తున్న వారే. చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ అశ్లీలాన్నీ, అరాచకాన్ని చూపిస్తున్నారు మరికొందరు మూవీ మేకర్స్. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.... నిత్యామీనన్ గురించి. తను చచ్చినా ఎక్స్ పోజింగ్ చేయనంటోంది. హీరోయిన్‌ అంటే ఎక్స్‌ పోజింగ్‌ చేయాల్సిందే... అనే రూల్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ అంటే నిత్యామీనన్ ను చెప్పుకోవాలి. సిచ్యువేషన్ అంటూ ఎక్కడో ఓ చోట అందాల ప్రదర్శన చేయక తప్పడం లేదు కొందరు హీరోయిన్లకు. నిత్యా మీనన్ కు కేవలం రంగు, అందమైన ముఖం... ఎత్తు చూస్తే నిండా ఐదడుగులైనా ఉంటుందో లేదో.... మరి... అయినా ఆఫర్లు వస్తూనే ఉన్నాయిగా. అంటే కేవలం టాలెంట్‌తోనే ఛాన్సులు కొట్టేయ వచ్చునని నిరూపిస్తోంది. ఒకప్పటి హీరోయిన్ సౌందర్య కూడా అప్పుడో ఇప్పుడో సిచ్యువేషన్ బట్టి నడుమైనా చూపించిందేమో కానీ, నిత్య మాత్రం నాభి కూడా చూపించేది లేదని తేగేసి చెపుతోందట.  తాజాగా విడుదల కాబోతున్న సన్నాఫ్‌ సత్యమూర్తిలాంటి పెద్ద చిత్రంలో కూడా ఆమె చూపించే ఛాన్స్ ఇవ్వలేదట. ఇందులో ఉన్న హీరోయిన్లు సమంత, ఆదా శర్మ పొట్టి దుస్తుల్లో అందాలు ప్రదర్శించారట. నిత్య స్ట్రాటజీని మెచ్చుకుని తీరాల్సిందే గానీ, సన్నజాజిలాంటి నడుమునైతే చూపించడానికీ, చూడ్డానికీ ఇష్టపడతారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేగా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ