బుల్లి తెర యాంకరింగ్ లో గ్లామర్ నింపిన తార అంటే ఉదయభాను అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈమె టీవీ షో పిల్లలు పిడుగులు మినహా మరెక్కడా కనిపించడం లేదు. సినిమా ప్రోగ్రాములన్నీసుమ ఎగరేసుకుపోతోంది. ఇక మరొక యాంకర్ పోటీ కూడా వచ్చేసింది ఉదయ భానుకు. ఉదయభానును మించిన హాట్ హాట్ దుస్తుల్లో అనసూయ అదరగొడుతోంది. ఈ కోవలోకి రేష్మీ మరికొందరు చేరిపోయారు. సమయస్ఫూర్తి, చక్కటి తెలుగు మాట్లాడ్డంలో సుమను ఎవరూ బీట్ చేయలేరన్నది వాస్తవమే అయినప్పటికీ ఓ సీనియర్ యాంకర్ గా ఉదయభానును పక్కన పెట్టేంతటి సీన్ కూడా లేదు. ఆమె తెరమీద కనపించకపోవడానికి కారణమేంటనేది అర్థం కావడం లేదు. ఒక వేళ ఉదయభాను నే ప్రోగ్రాములు తగ్గించుకుంటోందా? అనే డౌటు కూడా వస్తోంది. ఒకానొక సమయంలో ఉదయభాను యాంకరింగ్ చేస్తే సినిమా ప్రోగ్రాములో ఓ రకమైన కిక్ ఉండేది. జోష్ నిండిపోయేది. ఇప్పుడలాంటివేమీ లేవు. విజయవాడలో 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఆడియో సక్సెస్ ఫంక్షన్‌కి ఉదయభాను యాంకరింగ్ చేసినా, జనాల్లో జోష్ నింపలేకపోయిందని కమెంట్స్ వచ్చాయి. అంటే సుమ మాటల వాగ్ధాటి ముందు ఏ యాంకర్ నిలబడలేక పోతోందా? కేవలం సుమ ‘నాకు సమయం లేదండీ... నేను చేయలేను’ అంటేనే ఇతరులకు అవకాశాలు వస్తున్నాయా? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.