రాజమౌళి బాహుబలి సినిమా ఇంకా విడుదల కాకముందే ఆయన తరువాత సినిమా ఎవరితో అనే టాపిక్ పై ఫిల్మ్ వర్గాల్లో చర్చలు జరుగుతునాయి. ఇప్పుడు సినిమా పూర్తి కావడంతో ఈ ముచ్చట్లు మరింత ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఇప్పుడొక వార్త ప్రచారంలో ఉంది. రవి తేజతో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి రాజమౌళి సిద్ధమవుతున్నట్టు అనుకుంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సూపర్ డూపర్ హిట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వార్త ఎంత వరకు నిజమన్నది ఈ మాస్ మహారాజాగానీ, ఆ దర్శక ధీరుడుగా తెలియజేస్తే నిజమనుకోవాలి.