జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నాన్నకు ప్రేమతో పాటలు తాజాగా విడుదలయి మార్కెట్లో ఒక ఊపు ఊపుతున్నాయి. దేవీశ్రీ అందించిన రాకింగ్ మ్యూజిక్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎఫ్ఎం స్టేషన్లోనూ వీటి హడావుడే. పోటీగా రిలీజైన సోగ్గాడే చిన్నినాయన పాటలను పక్కకు నెట్టి చార్ బస్టర్ జాబితాలో అన్ని పాటలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే... నాన్నకు ప్రేమతో... తండ్రి కొడుకుల ప్రేమ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే ఆడియో పంక్షన్లోనూ అంతా ఎమోషన్ గా వారి వారి తండ్రుల గురించి చెప్పుకోచ్చారు. మరి అలాంటి చిత్రంలో నాన్నకు సంబంధించి ఒక్క పాట లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఫాలో.. ఫాలో..., నా మనసు నీలో, లవ్ మీ అగేయిన్ మూడు పాటలు రోమాంటిక్ పాటలుగా తెరకెక్కితే, లవ్ దెబ్బ ఐటం సాంగ్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక డోంట్ స్టాప్ పాట ఇన్సిపిరేషన్ సాంగ్ గా ఉన్నట్లు తోస్తుంది. మరీ ఇంతకీ అసలు పాట ఏదీ? నాన్నకు ప్రేమతో... అంటూ ఉత్త థీమ్ సాంగ్ ఇచ్చారా? లేక వన్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే అమ్మ రైమ్ లాగా మరో పాటను దాచిపెట్టారా? ఏదనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే నాన్నకు ప్రేమతో పాటలు నంబర్ వన్ పోజిషన్ లో కొనసాగుతున్నాయి.