సుకుమార్ ఫస్ట్ టైం మిస్సవుతున్నాడు

January 07, 2016 | 11:41 AM | 1 Views
ప్రింట్ కామెంట్
no-item-song-in-nannaku-prematho-niharonline

వైవిధ్యభరితమైన కథనంతో వన్ నేనొక్కడినే చిత్రం తెరకెక్కినప్పటికీ అది కాస్త అట్టర్ ఫ్లాప్ కావటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు దర్శకుడు సుకుమార్. అయితే హీరోలను డిఫరెంట్ గా చూపించగలిగే సుక్కూ మీద నమ్మకంతో పిలిచి మరీ ఓ అవకాశం ఇచ్చాడు యంగ్ టైగర్. టెంపర్ హిట్ అయ్యాక ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టి తీరాలని సుకుమార్ కి టార్గెట్ ఫిక్స్ చేశాడు. ఫాదర్ సెంటిమెంట్ రివెంజ్ డ్రామాగా నాన్నకు ప్రేమతో తెరకెక్కించాడు సుక్కూ. సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో సెన్సార్ పూర్తి చేసుకోబోతుంది. అయితే తను పాటించే ఓ సాంప్రదాయానికి ఫస్ట్ టైం ముగింపు పలికాడు సుకుమార్.

                                 ఆర్య, జగడం, ఆర్య-2, 100 పర్సంట్ లవ్, వన్ నేనొక్కడినే ఇలా స్టోరీ, కాన్సెప్ట్ ఎలాంటివైనా తన సినిమాలో ఐటెం సాంగ్ కంపల్సరీ పెడతాడు సుకుమార్. సాహిత్యంలో, పిక్చరైజేషన్లో వల్గారిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ దేవీ కంపోజ్ చేసే బీట్ లకు ఆ పాటలు జనాల్లోకి బాగా ఎక్కేస్తాయి. అదే రేంజ్ లో పాపులర్ అవుతాయి కూడా. అలాంటిది ఫస్ట్ టైం నాన్నకు ప్రేమతో లో ఐటెం సాంగ్ ను మిస్ చేస్తున్నాడు సుకుమార్. నిన్నటిదాకా లవ్ దెబ్బ సాంగ్ ఐటెం సాంగ్ అనుకున్న జనాలకు ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ కాదని చెప్పకనే చెప్పింది. ముందుగా ఈపాటను ఎన్టీఆర్ తమన్నాతో చిత్రీకరిస్తారని అంతా అనుకున్నారు. అయితే కథకు తగ్గట్లు ఐటెం సాంగ్ అంత అవసరం లేదని సుకుమార్ ఫిక్సయ్యాడట. ఇక ఈ పాటను ఎన్టీఆర్ రకుల్ పైనే తెరకెక్కినట్లు ఆ పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. ఐటెం సాంగ్ కాకపోయినప్పటికీ పక్కా మాస్ సాంగ్ గా తెరకెక్కిన ఈపాటలో జూనియర్ స్టెప్పులతో కుమ్మేసాడని, తన గత సినిమాల్లోని ఐటెం సాంగ్ కి ఈపాట ఏ మాత్రం తీసిపోదని సుకుమార్ చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ