కోలీవుడ్ ఈ యేడు మోస్ట్ వెయిటింగ్ మూవీ ఏదంటే వినిపించే పేరు పులి. ఇళయదళపతి విజయ్ హీరోగా దాదాపు 120 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ శిష్యుడు చింబుదేవన్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కింది. తమిళంలో ఇంతవరకు చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం తెరకెక్కినట్లు టాక్. ఇటీవల గ్రాండ్ గా విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి స్పందన బాగానే వచ్చింది. అయితే విజువల్ వండర్ బాహుబలితో పోలిస్తే అదేమంత గొప్పగా లేదని దేశమంతా టాక్. గ్రాఫిక్స్ కూడా ఏదో బీగ్రేడ్ లా ఉందని పెదవి విరుస్తున్నారు. బాహుబలికి దేశం మొత్తం బ్రహ్మరథం పట్టారు. దీనికి తోడు ఐ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇది కోలీవుడ్ లో కాస్త కంటగింపుగా మారింది. ఇక పులిని తమిళ బాహుబలిగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. బాహుబలికి తాను ఏమాత్రం తీసి పోనని ఈ చిత్రాన్ని తెగప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఒకేసారి వినాయకచవితికి ఈ చిత్రాన్ని తమిళ్ తోసహా పలు బాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు.
ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్ మీడియా వారు రూ.12 కోట్లకి సొంతం చేసుకున్నారు.ఇంతదాకా బాగానే ఉంది. మరి ఇంత డబ్బాలు కొడుతున్న ఈచిత్రానికి ప్రచారం ఏదీ? తెలుగు మాట పక్కన బెట్టి అసలు తమిళంలోనూ ఈ చిత్రానికి ఎక్కడా ప్రచారం నిర్వహించడం లేదు. చిత్ర విడుదలకు తేదీ దగ్గర పడుతుండటం, ఏ ఆర్భాటం లేకపోవటంతో ఇప్పుడు అసలుపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బాహుబలి కోసం ఆ చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాలు తిరిగింది. డబ్బింగ్ సినిమాలా కాకుండా ఆడియో వేడుకలను ఘనంగా నిర్వహించింది. ప్రమోషన్ ను కూడా అదే రేంజ్ లో నిర్వహించింది. ఫలితం చిరస్థాయిగా నిలిచి పోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మరి పులి పరిస్థితి ఏంటీ? ఆ రేంజ్ లో కాకపోయినా ఏదో కానిచ్చాం అన్నట్లుగా కూడా చెయ్యటం లేదు. కనీసం ఆడియో విడుదల తేదీ కూడా ఎప్పుడో ప్రకటించలేదు. పోనీ హడావుడిగా ఆడియో నిర్వహించిన చిత్రప్రమోషన్ కోసం ఎక్కువ టైం కూడా ఉండదు. విజయ్ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదనే ఇలా లైట్ తీస్కుంటున్నారా? లేక అసలు సినిమాలోనే కంటెంట్ ఏం లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.