తీరిక లేని షూటింగ్ లతో బీజిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ అసలు నిద్రే పోవడం లేదట. దాదాపు 68 గంటల పాటు వరుసగా షూటింగ్ లలో పాల్గొంటునే ఉన్నాను. బాగా అలసిపోయాను. నా ప్రియమైన బెడ్ నాకోసం ఎదురు చూస్తోంది అని ట్విట్టర్ లో ట్విట్ చేసింది. వరుసబెట్టి హిట్లు కొడుతున్న ఈ భామ కోసం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ క్యూ కడుతూ ఉంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక హిందీ, తమిళ చిత్రాలతోపాటు అరడజనుకు పైగా తెలుగు చిత్రాలు ఉన్నాయి. లక్కీ గర్ల్ గా భావించి బడా బడా హీరోలు సైతం ఈ గుమ్మ కోసం ఎగబడుతున్నారట. ఇక నిద్ర లేకపోతే గ్లామర్ తగ్గిపోయి అవకాశాల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ లున్నాయంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ లో జోకులేస్తున్నారు. పాపం రకుల్ పాప... ఎంత కష్టం వచ్చి పడిందమ్మ నీకు.