బడాస్టార్లు... బకాయిదారులు...

February 09, 2015 | 02:35 PM | 37 Views
ప్రింట్ కామెంట్
telugu_cinema_flag_niharonline

వ్యాపారంలో కోట్లు కోట్లు గడిస్తే సంతోషంగా పండుగలు చేసుకుంటారు. గానీ టాక్స్ కట్టమంటే మాత్రం వెనకడుగు వేస్తుంటారు చాలా మంది. సినీ తారల టాక్స్ బకాయిలు ఎప్పుడూ వార్తలకు ఎక్కుతూనే ఉంటాయి. సినిమా వ్యాపారంలో కోట్ల వ్యాపారం చేసే నిర్మాతలు, దర్శకులకు, స్టార్లకు పారితోషికం కోట్లు కోట్లు ముట్టచెపుతుంటారు. ప్రభుత్వానికి టాక్స్ మాత్రం చెల్లించడానికి మనసొప్పదు వీరికి. ప్రభుత్వానికి కట్టాల్సిన 121.36 శాతం ట్యాక్స్ ను కూడా నిర్మాతల నుంచి గుంజేసుకుంటున్నారట చాలా మంది తారలు. అలా తీసుకొని కూడా గవర్నమెంట్ కు చెల్లించడం లేదట. ఇటీవల సెంట్రల్ క్సైజ్ కస్టమ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సినీ తారలు చాలా మంది బకాయిలు 100 కోట్ల పైబడిన ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందంటున్నారు. ఈ విషయంపై ఫిలింఛాంబర్ అధికారులు కూడా అసం తృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 50 లక్షలకు మించి పన్ను బకాయిపడిన వారిని నాన్ బెయిల్ వారెంట్ తీసుకుని జైలుకు పంపించే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉకుది. సమన్లు అందుకున్న వారిపై కూడా దాడులు చేసి కటకటాలకు పంపనున్నారు. రాజకీయంగా కీలకంగా ఉన్నా ఓ ప్రముఖ నటుడితో పాటు, ఓ గాయని, మరికొంత మంది తారలు ఎక్కువ బకాయి పడ్డవారిలో ఉన్నారు. వీరు కనీసం కస్టమ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదట. 2011లో రెండు ప్రముఖ సంస్థలపై కస్టమ్స్ దాడులు నిర్వహించింది. అప్పట్లో కొంత సయం కావాలని కోరడంతో గడువిచ్చారు. తరువాత మళ్ళీ మామూలైపోయింది. ఇక ఇప్పుడు మాత్రం కస్టమ్స్ అధికారులు ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ