భూమికకు ఇక తల్లి పాత్రలేనా?

January 19, 2015 | 12:51 PM | 40 Views
ప్రింట్ కామెంట్

మహేష్ బాబు, పవన్ కళ్యాన్, ఎన్టీ ఆర్ వంటి పెద్ద స్టార్ల తో నటించి మాంచి హిట్లిచ్చిన భూమిక ఇప్పుడు తెరమరుగైందనే చెప్పాలి. లడ్డూబాబు అనే చిన్న సినిమాలో నరేష్ తో నటించిన భూమిక ఇప్పుడు తల్లి పాత్రలోకి దిగిపోయింది. అక్కటా... హీరోయిన్ ల కెరీర్ ఎంత షార్ట్ పిరియడ్ అనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమిక తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. యోగా మాస్టర్ భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించేసింది. ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధపడింది కానీ, తనకు మంచి ఆఫర్లు ఎవరిస్తారు? ప్రస్తుతం తను ‘లవ్ యు అలియా’ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. ఇందులో 22 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటిస్తోంది. ఇది వయసుకి మించిన పాత్రే. అయినా హీరోయిన్లకు 30 దాటిందంటే ఇక వదినపాత్రలు, తల్లి పాత్రలకు తప్ప హీరోయిన్ ఛాన్స్ లు ఇవ్వరు కదా. అయినా డిగ్నిటీ పాత్రల్లో భూమిక చక్కగా ఇమిడిపోతుంది. గతంలో రవి తేజ సినిమాలో ’నా ఆటో గ్రాఫ్’ అనే సినిమాలో చేసి, ప్రేక్షకుల అభిమానం మెండుగా సంపాదించింది. అలాగే ఇది కూడా ఒక మంచి క్యారెక్టర్ అని చెపుతోంది. ఆ క్యారెక్టర్ ఎలాంటిదో కానీ, లడ్డూ బాబు చిత్రంలో మాత్రం గొప్ప పాత్ర కాదనే చెప్పాలి. అయినా ఏదోలా సమర్థించుకు నెట్టుకు రావాలి కదా... ఒకప్పుడు పెద్ద హీరోయిన్ గా వెలిగిపోయింది మరి...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ