టాలెంట్ ను నమ్ముకుని ఇప్పటి వరకూ ఛాన్స్ ల కోసం ఎదురు చూసిన నటుడు నాని. ప్రారంభంలో అష్టా చెమ్మ, అలా మొదలైంది... ఈగ వంటి సినిమాలు మంచి హిట్లే అయినప్పటికీ, రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి ఎదగలేదన్నది ఓ టాక్. అంటే డిమాండ్ చేసేందుకు స్టార్ స్టేటస్ సంపాదించాలని నాని ఇన్నాళ్ళు తపన పడ్డాడట. ఇప్పుడిక నానికి టైమొచ్చింది. భలేభలే మగాడితో ఆయన స్టార్ తిరిగి పోయింది. కెరీర్ ఓ మాదిరిగా నడవడం వేరు, స్టార్ తిరగడం వేరు. రెండు హిట్లు వచ్చి రెండు ఫ్లాపులు వచ్చాయంటే మళ్ళీ వారి వంక చూడరు ఏ నిర్మాతా, దర్శకుడు... స్టార్ హీరోలకు అలా కాదు కదా...! అయినా అలాంటి వారు కూడా ఓ ఫ్లాప్ తగిలిందంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏమైనా ఒకప్పటిలా లేదు ఇప్పుడు ఫీల్డ్, ఎవరి స్టార్ ఆకాశానికి వెళుతుందో, ఎవరిని పాతాళానికి తొక్కేస్తారో అనే సంశయంతో ఉన్నారు. కానీ నాని ఫేట్ మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. తొలివారంలోనే 14 కోట్లు కొల్లగొట్టి భలే భలే మగాడయ్యాడు. ఇప్పటివరకూ ప్రాజెక్టుల గురించి తప్ప పారితోషికం గురించి ఆలోచించని నాని. ఇప్పుడు టైం రావడంతో రేటు పెంచాడని టాక్. ఇప్పుడు పెద్ద పెద్ద బేనర్లు కూడా నాని డేట్స్ కోసం క్యూ కడుతున్నాయట. సహజ నటుడికి స్టార్ తిరిగి పోయిందన్నమాట. ఆల్ ద బెస్ట్ నాని.