మా ఎన్నికలకు మరో ట్విస్ట్

April 16, 2015 | 05:30 PM | 55 Views
ప్రింట్ కామెంట్
O.Kalyan_Press_niharonline

మాఎన్నికల ఫలితాల విడుదలపై కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక గెలుపోటములు తేల్చుకోవాలనుకుంటున్న సమయంలో ఓ. కళ్యాన్ మళ్ళీ తిరకాసు పెట్టేశాడు. ఆయన ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కాకుండా కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫలితాల విడుదలను గతకొద్ది రోజులుగా కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు అంతా సద్దుమణిగిందని అందరూ భావిస్తుండగా ఒ.కళ్యాణ్ హైకోర్టులో అప్పీల్ చేసాడు. మాఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కాబట్టి తిరిగి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఒ.కళ్యాణ్ కు రూ.10 వేలు జరిమానా కూడా విధించింది. అయితే ఇప్పుడు వేసిన ఈ పిటిషన్ హైకోర్టు స్వీకరిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మాఅధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన వారితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది,.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ