ఇదేంటి ఆయన పాటు వింటూనే ఉన్నాం కదా అనుకోకండి. జె.ఏసుదాసు పాట హిందీలో 20 ఏళ్ళ తరువాత పాడారట. ఒకప్పుడు హిందీలో ఆయన చాలా పాటలు పాడారు. మధ్యలో ఎందువల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఆయన ‘బేర్ ఫుట్ టు గోవా’ అనే చిత్రంలో ఇప్పుడు మళ్ళీ ఓ పాట పాడారట. అయితే ఆయన రోజుకు పదహారు పాటలు అవలీలగా పాడే ఆయన ఈ పాటకు మాత్రం నాలుగు గంటల సమయం తీసుకున్నారట. ‘నైనా దొ నాయరే’ అంటూ సాగే ఈ పాట చాలా బాగా రావాలని ఇంత సమయం తీసుకున్నారంటున్నారు. ఈ పాట విన్న బాలీవుడ్ ప్రముఖులు చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారట. అంతే కాదు పాట సాహిత్యం కూడా అద్భుతంగానే ఉందట. ఏసుదాసు పాటలంటేనే సాహిత్యపరంగానూ, సంగీతపరంగానూ హత్తుకునేలా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.