మామూలుగా చూస్తే, మళయాళం, తెలుగు దృశ్యం పెద్ద తేడా ఏమీ లేనట్టే కనిపిస్తున్నాయట. కానీ తేడా లేకుండా 3.00 గంటల నిడివి అయిపోదు కదా... అంటే సాగదీసినట్టే లెక్క. మామూలుగా దృశ్యం మళయాళ వెర్షన్ కంటే పాపనాశం ఇంకో 20 నిమిసాలు నిడివి పెరిగిందట. మలయాళ వెర్షన్ 2 గంటల 40 నిమిషాలు ఉంటే... పాపనాశం మూడు గంటల నిడివి దాటేసిందట. తెలుగు వెర్షన్ మళయాళం కంటే 20 నిమిషాలు తగ్గించేశారు. అంటే తెలుగుతో పోల్చుకుంటే పాపనాశం 40 నిమిషాలకంటే ఎక్కువైపోయింది. తెలుగులో మళయాళం కంటే 25 నిమిషాలు తగ్గించింది డైరెక్టర్ శ్రీవిద్య. ఇది తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం. పాటలు కూడా ఎక్కువగా లేని ఈ సినిమాను మూడు గంటలు చూడ్డమంటే మామూలు విషయం కాదు. అంటే తను నటుడిగా మరికాస్త చూపించాలనుకున్నాడా కమల్ హాసన్ ఎందుకు ఇలా సాగదీశారో అర్థం కావడం లేదు. ఈ సినిమా శుక్రవారం (జూన్ 3 )విడుదలవుతోంది. మరి ఈ మూడు గంటలను తమిళులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.