ఒకప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి తేడా ఉన్నట్టే... ఒకప్పుడు సినిమా తారలకు ఇప్పటి సినిమా వాళ్ళకు కూడా చాలా భేదం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పలువురు సినిమా వాళ్ళు గొడవలు, దాడులు లాంటి సంఘటనలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇలాంటి గొడవే ఒకటి మళ్ళీ వెలుగు చూసింది. పబ్‌లో పీకలదాక తాగిన ఓ యువనటుడు మరొక యువకుడిపై దాడి చేసి గాయపర్చాడు. ఆ నటుడు మరెవరో కాదు, పరారె చిత్రంలో నటించిన నండూరి ఉదయ్ కిరణ్. అతన్ని బాబీ అని కూడా పిలుస్తారు. ఈయనగారి పేరు డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది. ఇప్పుడు గొడవకు కారణం కూడా ఈ డ్రగ్స్ విషయమేనట. ఈయనగారు స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఓ పబ్ కు వెళ్లాడు. అక్కడ ప్రవీణ్‌కుమార్ అనే యువకుడితో గొడవకు దిగి తనను అక్రమంగా డ్రగ్స్ లో ఇరికించాడంటూ అతనిపై దాడిచేశాడు. ఇది పెద్దది కావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.