పరిణీతి చోప్రా కల ఏమిటంటే ఉదయం నిద్రలేవగానే సముద్రాన్ని చూడాలనట. అందుకే ఆమె సముద్ర ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని చాన్నాళ్ళ నుంచి కలలు కంటోందట. అయితే ఇప్పుడు పరిణీతి తన కల నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఈ విషయమే ఆమె చెబుతోందిలా... ‘ఉదయాన్నే కళ్లు తెరవగానే సముద్రుణ్ణి చూడాలి.... ఆ సాగరఘోష నా జీవితంలో భాగం అవ్వాలి... సముద్రానికి ఆటుపోట్లు ఎలాగో, జీవితంలో కష్టసుఖాలు అలాగే... నా అభిరుచికి తగిన నా కలల గృహం నా సొంతం కాబోతోంది...’ ముంబయ్‌లోని బాంద్రాలో తన కలల గృహాన్ని నిర్మించుకుంటున్నారు. తనకు ఇదంతా ఓ కలలా ఉందట. ఇంకా తన కలల గృహంలో ఏకంగా వెయ్యి పుస్తకాలతో నింపేస్తుందట. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ తనకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టమట. పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తున్నానంటోంది. అయితే తన కలల సౌథంలో తను మాత్రమే ఉంటుందట. మరెవ్వరికీ చోటివ్వదట.