2015 నందమూరిదే కావాలన్న బుడ్డోడు

January 02, 2015 | 02:13 PM | 39 Views
ప్రింట్ కామెంట్

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన పటాస్ ఆడియో జానకిరాం మృతి కారణంగా ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ గురువారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక సినీప్రముఖులు హాజరయ్యారు. పటాస్ హీరో కల్యాణ్‌రామ్ ఎమోషన్ కు లోనై ఎక్కువగా మాట్లాడలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, జానకిరామ్ అన్నయ్య మా మధ్య వుంటే బాగుండేదన్నారు. అన్నయ్య ఆశీర్వాదం మాకు తప్పకుండా వుంటుందని అన్నారు. నలుగురు మెచ్చుకునేలా బతకాలని కోరుకుంటున్నానని అన్నాడు. అన్నయ్య కల్యాణ్‌రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని ఆయన ఎప్పుడూ ఇలాగే అజాత శత్రువుగా వుండాలని ఆశించాడు. ఈ 2015 సంవత్సరంలో మా కుటుంబం పేరు మార్మోగాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ అన్నారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా కళ్యాణ్‌రామ్ అన్న జానకీరామ్ అకాల మరణంతో విడుదల వాయిదా పడింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కళ్యాణ్‌రామ్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ డైలాగ్స్ పేల్చాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ