మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడు, ప్రముఖ యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మళ్ళీ పెళ్ళికొడుకయ్యాడు. ముస్లిం యువతి జఫరున్నీసాను ఆయన గురువారం పెళ్లాడారు. ఆయన ఈ మధ్యే ఇస్లాం మతం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. 35 సంవత్సరాల యువన్ తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ సుజయ చంద్రన్‌ను పెళ్లాడారు. ఇద్దరూ పరస్సర అంగీకారంతో విడిపోయారు. తర్వాత 2011లో సెప్టెంబర్ 1న శిల్పా అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతోనూ సంబంధం తెగిపోయింది. తెలుగులో పంజా, గోవిందుడు అందరి వాడేలే, ఆడంతే అదో టైపు, దేనికైనా రెడీ, రాజుభాయ్, మిస్టర్ నూకయ్యా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, హ్యాపీతో పాటు అనేక చిత్రాలకు సంగీతం అందించారు. తన మత మార్పిడికి కారణం అమ్మే అని చెప్పుకున్నాడు యువన్. నాన్న మత మార్పిడిని అడ్డుకోలేదని కూడా అన్నారు.