తంబి, తనయుల కన్నా చిరుయే తోపు

December 18, 2014 | 11:15 AM | 46 Views
ప్రింట్ కామెంట్

ఈ ఏడాది గూగుల్ ఇండియా సెర్చ్ జాబితాను విడుదల చేసిన సంగతి విదితమే. ప్రపంచ ద్రుష్టినంతా తన వైపు తిప్పుకున్న మోదీని కాదని, పార్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ కు మన ప్రజలు పట్టంగట్టారు. అయితే టాలీవుడ్ విషయాని కొస్తే ఇక్కడో గమత్తైన విషయం చోటుచేసుకుంది. ఈ జాబితాలో మహేష్, అల్లుఅర్జున్, ప్రభాస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు టాప్ 5 లిస్ట్ లో ఉన్నారు. మహేష్ ఎలాగూ టాప్ 5 ఉండటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. బన్నీ రేసుగుర్రంతో ఫాంలోకి వచ్చి ప్రభాస్ ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో కూర్చన్నాడు. ఇక బాహుబలి 3 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతి రెండు స్థానాలపైనే చర్చ అంతా. సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. పైగా మంత్రి పదవి కూడా లేదు. అయినా మెగాస్టార్ చిరంజీవి తన క్రేజ్ ఏంటో ఈ ఫలితాలలో బయటపెట్టారు. ఆయన ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యేడాది అత్యధికంగా వార్తల్లో నిలిచారు. ఓ వైపు సినిమాల ద్వారానే కాకుండా, మరోవైపు రాజకీయంగా బీజేపీ-టీడీపీ కూటమికి స్టార్ కంపెయినర్ గా పనిచేసిన పవన్ కళ్యాణ్ ఓ రకంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఉండోచ్చని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ విచిత్రంగా ఆయన 5 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 40 కోట్ల హీరోగా మాంచి మార్కెట్ ఉన్న చిరు తనయుడు రాంచరణ్ ఈ జాబితాలో లేకపోవడం కూడా షాక్ అనే చెప్పుకోవాలి. మరో స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ