పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వార్తలు రాసేస్తున్నారు. న్యూస్ రాయడానికి ఇప్పుడు ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు... కథలు కథలుగా రాసుకోవచ్చు... ఈ గెటప్ సినిమా కోసం... అనొచ్చు... కథలతో... సిట్టింగ్స్ తో తీరిక లేక గడ్డం గీసుకోలేదనొచ్చు... పవన్ ఓ భక్తి సినిమాలో ఫలానా డైరెక్టర్ తో... ఫలానా నిర్మాతతో నటిస్తున్నాడని రాయొచ్చు... ఏది రాసినా... ఎలా రాసినా వార్తే... ఆయన మీద జనాలకున్న అభిమానం అలాంటిది. రేపటినుంచి ఆయన అభిమాన కుర్రకారు అలా గుబురు గడ్డం పెంచి... తెల్ల లుంగీ... తెల్ల చొక్కాతో కాలేజీకి వెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకింత అభిమానం ఆయనంటే....? ఆయన ముక్కుసూటితనం జనాలకు నచ్చుతుందా? ఆయన సీరియస్ నెస్ వెనుక ఓ మానవతా వాది ఉన్నాడన్న అభిమానమా? కొత్తగా ట్రెండ్ సెట్ చేసి సినిమాలో ఓ కొత్త హీరోను చూపించాడన్న అభిమానమా? జన సేన పార్టీ పెట్టి... రొచ్చు రాజకీయాల్లో దిగకుండా సేవ చేస్తానన్నందుకు అభిమానమా? ఇందులో ఒక్కొక్కరికీ ఒక్కొక్కటీ నచ్చొచ్చు... కానీ అందరికీ నచ్చేది అనారోగ్యంతో ఉన్న ఓ పేషెంట్ (శ్రీజ) సహాయం అందించడమే కాక, ఆ పేషెంట్ దగ్గరికి నేరుగా వెళ్ళి పలకరించడం... అనేది అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. మరి ప్రాణాలతో బయట పడ్డ ఆ అమ్మాయికి ఆయన మీద అభిమానం ఏ రేంజ్ లో ఉంటుంది? ఏది ఏమైనా... ఆయన అభిమాన ధనికుడు అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇదీ పవన్ లెక్క... అ..... ఉ...