సర్దార్ దృష్టిలో అంతా సమానమే

March 11, 2016 | 05:47 PM | 1 Views
ప్రింట్ కామెంట్
pawan-kalyan-friendly-atmosphere-in-sardar-sets-niharonline

ఓ టాప్ హీరోగా ఎంత క్రేజ్ వున్నా పవన్ కళ్యాణ్ లో ఎంతమాత్రం అహంభావం వుండదనే విషయాన్ని ఆయన్ని దగ్గరగా చూసినవాళ్లు చెబుతుంటారు. ప్రార్థించే పెదవుల కన్నా... సాయం చేసే చేతులు మిన్నా అన్న నానుడిని గుట్టు చప్పుడు కాకుండా ఫాలో అయిపోతుంటాడు. అంతేకాదు తనతో కలిసి పనిచేసే వాళ్లందరిని ఆయన ఎంతో అభిమానంతో చూసుకుంటాడని ఆయా సంఘటనలను పలువురు గుర్తుచేస్తుంటారు కూడా. అంతేనా ఆయన ప్రోద్భలంతో పైకొచ్చిన వారు కూడా ఎందరో. అలాగే ఇప్పుడు 'సర్దార్' టీమ్ పట్ల ఆయన చూపించే అభిమానం గురించి కూడా చెప్పుకుంటున్నారు.

                    ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఎవరి పరిధిలో వాళ్లు కష్టపడుతున్నారు. దాంతో వాళ్లకి భోజన ఏర్పాట్లను కూడా పవన్ చూసుకుంటున్నాడట. లంచ్, డిన్నర్ లో వెజ్, నాన్ వెజ్ ఇలా ఎవరికి ఇష్టమైన భోజనం వారికి అందేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. అలాగే తాను వారితోపాటే భోజనం చేస్తూ అక్కడ స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా చూస్తున్నాడని చెబుతున్నారు. తామంతా ఒకటేననే ఫీలింగ్ ను టీమ్ లో తీసుకురావడం కోసం .. వాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపడం కోసం, పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన స్థాయిని మరింత పెంచేదే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ