ఇదంతా బ్రూస్ లీ సినిమా కోసం పడుతున్న తిప్పలు అన్నది చెప్పకనే చెపుతున్నట్టు అనిపిస్తోంది. బహు అరుదుగా కనిపించే కలయిక ఇది. ఎన్ని సినిమా ఫంక్షన్లు జరిగినా హాజరు కాని పవన్ కళ్యాణ్ ఆది వారం సాయంత్రం చిరంజీవిని కలిసాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్ర షూటింగ్‌లో పూర్తయిన తరువాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇక్కడ మనకు తెలిసిన విషయం మాత్రం చాన్నాళ్ళ తరువాత బ్రూస్ లీ చిత్రంలో అన్నగారు నటించినందుకు అభినందనలు తెలపడానికి అని తెలుస్తోంది. కానీ ఈ కలయిక ఎందుకు? సినీ వర్గాలు, సామాన్యులు మాత్రం ఎవరికి తోచింది వాళ్ళు అనేసుకుంటున్నారు. ఎక్కువ శాతం జనాలు బ్రూస్ లీ కలెక్షన్ బూస్టింగ్... అంటున్నారు. ఆ సినిమాని ఇంకా చూడలేదని చెప్పిన పవన్ ఇలా వెళ్లటానికి కారణం కేవలం పవన్ ఫాన్స్ ను ఈ సినిమా వైపు దృష్టి మరల్చడానికే అని తెలుస్తోంది. ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజుకే కలెక్షన్లు పడిపోయాయి. దీంతో రాంచరణ్ సర్దార్ సెట్ కు వెళ్ళి కలిసి ఆహ్వానించి నట్టు తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయనే టాక్ రావడంతోనే మెగా ఫాన్స్ ఇప్పుడు ఒక్కటిగా లేరు. పవన్ ఫ్యాన్స్ విడిగా ఉండడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ ఈవిధంగా ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఊహాగానాలు ఎలా ఉన్నా. ఈ కలయికతో బ్రూస్ లీ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
చాలా విరామం తర్వాత 'బ్రూస్‌లీ' చిత్రంలో కనిపించిన అన్నయ్య చిరంజీవికి పవన్ అభినందనలు తెలిపారు. చిరంజీవి నటించిన 150వ చిత్రం కావడంతో ఆయన కోసం 150 పువ్వులున్న ప్రత్యేక పుష్పగుచ్ఛాన్ని పవన్ ఆయనకు అందించారు. 'చాలా విరామం తర్వాత అన్నయ్య మళ్లీ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. పొలిటికల్ జర్నీ మొదలయ్యాక మేం చాలా అరుదుగా కలుసుకున్నాం. రాజకీయాల పరంగా మా ఇద్దరి విధానాలు వేరైనా వ్యక్తిగతంగా అన్నయ్య అంటే తనకు చాలా ఇష్టమన్నారు పవన్ కళ్యాణ్.