సౌత్ సోయగం సమంతకు మనసులో ఏమీ దాచుకోవటం అస్సలు ఇష్టం ఉండదట. మనసులో ఏది అనిపిస్తే చాలు దాచుకోకుండా వెంటనే బయటికి చెప్పేస్తూ ఉంటుందీ బ్యూటీ. విమర్శలకు దారితీసిన ఫర్వాలేదు కానీ, తనకు ఏదీ దాచుకోవటం ఇష్టం ఉండదని చెబుతోంది. ఈ విషయంలో ఇగోను సైతం పక్కనబెడుతుంది. అలాగే స్టార్ హీరోయిన్ అనే హోదాను లైట్ తీస్కోని చిన్న చిన్న సినిమాల ఫంక్షన్లకు కూడా వెళ్తుంది సమంత. అంతేకాదు తనకు పోటీ ఎవరూ లేరని, తన సహచర నటీమణులంతా ఫ్రెండ్సేనని చెప్పుకొస్తుంది కూడా. వారి టాలెంట్ ను ఎంకరేజ్ చేయటమే కాదు, అడపాదడపా కాంప్లిమెంట్ లు కూడా ఇస్తుంది.
తాజాగా అలాగే మరో అందాలతార రాయ్ లక్ష్మిని పొగడ్తలతో ముంచెత్తింది సమంత. ఆమె నటించిన శివగంగ సినిమా ఆడియో పంక్షన్ కి సమంత ముఖ్యఅతిథిగా హాజరయ్యింది. ఇక మైక్ అందుకున్న సమంత ఈ వేడుకలో నువ్వు చాలా స్టన్నింగ్ గా వున్నావు. అంతేకాదు, ఫ్యాషన్ ఐకాన్ లా మెరిసిపోయావు" అంటూ రాయ్ లక్ష్మిని పొగిడేసింది. ఈమేరకు ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టింది. అంతేకాదు, 'శివగంగ' ట్రైలర్ కూడా చాలా భయపెట్టిందని పేర్కొంది. మొత్తానికి స్టార్ హీరోయిన్ అయిన సమంత పొగడ్తలతో రాయ్ లక్ష్మి ఇప్పుడు తెగ ఖుషీ అయిపోతుందట.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ కామన్. కానీ, మనసులో ఎలాంటి భావజాలాలు పెట్టుకోకుండా బహుశా సాటి హీరోయిన్ ను పొగిడేది ఒక్క సమంతే కాబోలు.