పవన్ నోట అన్నయ్య మాట

January 05, 2015 | 01:19 PM | 68 Views
ప్రింట్ కామెంట్

‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ లో పవన్ ఉద్వేంగా అభిమానుల గురించీ, సినమాల గురించీ మాట్లాడుతూ అన్నయ్య ప్రస్థావన కూడా తేవడంతో, మెగా అభిమానులంతా ఊరట చెందారు. వీరిద్దరికీ విభేదాలు వచ్చాయనీ, ఇక మాట్లాడుకోరేమో అని భావించిన అభిమానులు అన్నయ్య గురించి మాట్లాడడంతో ఉప్పొంగి పోయారు. ఒకానొక సందర్భంలో అడవుల్లోకి వెళ్లిపోవాలనుకున్నానని, తిరిగి రానేమో అనుకున్నాను, కానీ అన్నయ్య పిలవడంతో వెనక్కి వచ్చానని అన్నయ్య గురించి గుర్తు చేసుకున్నాడు పవన్. యోగాలు, ధ్యానాలు ఏవీ పని చెయ్యలేదని అన్నయ్య మాటలు నామీద బాగా పని చేశాయని అన్నాడు. శ్రమ, కష్టం గురించి అన్నయ్య చెప్పాకే నాకు తెలిసాయని ఆయన చెప్పుకొచ్చారు. కథలు ఎంపిక చేసుకోవడం కూడా అన్నయ్య నేర్పించినదేనని అన్నయ్య గురించిన మాటలు ఆయన నోట వినడంతో మెగా అభిమానులంతా మళ్లీ అన్నాతమ్ములు కలిసిపోయారని ఆనందపడ్డారు. ఎంత అన్నదమ్ములయినా ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా అయినంత మాత్రాన శత్రువులు కారు కదా, రాజకీయాల్లో వేరుపడవచ్చు. ఇద్దరి ఆలోచనలూ వేరు కావచ్చు. అంత మాత్రం చేత వీరిద్దరూ వేరయినట్టు కాదని సామాన్యుల్లోనూ, అభిమానుల్లోనూ ఒక చర్చ కొనసాగుతోందిప్పుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ