పవన్ కొత్తగా ఆలోచించమంటున్నాడు

December 08, 2014 | 04:17 PM | 74 Views
ప్రింట్ కామెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఆయన అలాగే ఏది చేసిన కొత్తగానే ఉంటుంది కాబట్టే అంతమంది ఫాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. తన నడక, డ్రెస్, హెయిర్ స్టయిల్, డైలాగులు, యాక్షన్ అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఈ మధ్య విడుదలైన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ మోషన్ ఇందుకో చక్కని ఉదాహరణ. దీని బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. యూత్ ఆ మ్యూజిక్ ను తమ ఫోన్ రింగ్ టోన్ గా మార్చుకున్నారు. ఇక ఆ కొత్త దనమే గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ లో కూడా కొత్తదనం ప్రతిబింబించాలని కళ్యాణ్ ఆరాటపడుతున్నాడట. అందరినీ ఆకట్టుకునేలా ప్రత్యేక తరహాలో ఉండాలనుకుంటున్నారట. ఈ నెల చివర్లో జరగబోయే ఆడియో ఫంక్షన్లు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.ఈ సినిమాలో పవన్ కనిపించేది తక్కువ సమయమే అయినా ఆయనకున్న క్రేజ్ వల్ల ఈ ప్రమోషన్ కూడా ఆయన పేరుమీదే జరుగుతోంది. అయితే ఈ ఫంక్షన్ లో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా స్టేజ్ డెకరేషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలా ప్లాన్ చేయమని పవన్ సలహా ఇచ్చాడట. ఈ మధ్య పేట్రేగిపోతున్న యాంకర్ల స్కిన్ షోలు, రికార్డింగ్ తరహాలో డాన్సులు ఉండకుండా సాంప్రదాయబద్దంగా ఉండాలని నిర్వాహకులను సూచించాడట. మరి పవన్ చేసిన ఈ సూచనలు మరికాస్తా డిటేయిల్డ్ గా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ