పవన్ కళ్యాన్ కుటుంబం ఒకప్పుడు ఒక్కటిగా ఉండి, విమర్శలను విబేదాలను ఎదుర్కొనేవారు. ఇంతకుముందు సినిమా ఫంక్షన్లలో చిరంజీవిపై ఎవరేమన్నా కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ వెంటనే స్టేజీ ఎక్కి సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో కూడా చిన్న సంఘర్షణలు చోటు చేసుకున్న సందర్భంలో అన్నదమ్ములంతా ఒక్కటిగా ఉన్నారు. కానీ ఇటీవల అనూహ్యంగా చోటు చేసుకున్న రాజకీయ విభేదాల కారణంగా... అన్నదమ్ములిద్దరూ పార్టీలు మారిపోయారు. ప్రస్తుతం చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పవన్ వస్తాడా? రాడా? అనే విషయంపై కూడా చర్చలు జరిగాయి. కానీ చివరికి పవన్ శనివారం చిరంజీవి ఇంటికి వెళ్ళి అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అభిమానుల మధ్య జరిగిన వేడుకలో పవన్ లేకపోవడం... ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటూ కేకలు వేయడంతో నాగబాబు ఒక దశలో చిరాకు ప్రదర్శించాడు కూడా. కానీ చాలా కాలం తరువాత పవన్ చిరంజీవిని కలిశారు. మళ్ళీ అన్నదమ్ములిద్దరూ ఆనందంగా ముచ్చటించుకున్నారు. పవన్ కళ్యాన్ అన్నయ్యను ప్రస్తావిస్తూ... ఓ మీటింగ్ లో తన మనసులోని మాటను బయట పెట్టారు. ఆయన చిరంజీవి మనసు గాయపరిచినట్టు తెలిపాడు. ప్రజల కోసం తండ్రి తరువాత తండ్రి లాంటి సొంత అన్నయ్యనే వదులుకున్నానని అన్నాడు. అయినా ప్రజా సంక్షేమం కోసం రాజీపడనని కూడా స్పష్టం చేశాడు.