పెళ్ళి చేసుకుంటానంటూ... ఇదేం తిరకాసు?

December 20, 2014 | 05:24 PM | 33 Views
ప్రింట్ కామెంట్

ఇటీవల చెల్లెలి పెళ్ళి ఘనంగా జరిపించిన సల్మాన్ ఖాన్ తానూ పెళ్ళి చేసుకుంటాడట. ఎప్పుడనుకుంటున్నారు? 2015లో. 50 ఏళ్ళకు చేరువైన ఈ నటుడికి పెళ్ళి చేసుకోవాలని కోరిక కలగడం నిజమేనా? పాపం అభిమానులు ఆయన పెళ్ళి చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారట. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చాడు. ముంబైలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని తన మనసులోని మాట బయట పెట్టాడు. ఖాన్ల త్రయం సల్మాన్, అమీర్, షారూక్ లు కలసి నటించే చిత్రం ప్రారంభమయ్యేలోగా పెళ్లి పీటలు ఎక్కుతానని సల్మాన్ వెల్లడించాడు. తనను అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ఆయన నోటి వెంట ఈ మాట రాగానే అభిమానులు తెగ సంతోష పడిపోయారట. అయితే ఆ మధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ తాను ఇప్పటికీ వర్జిన్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంతకూ ఈ తిరకాసు మాట ఏంటి? ముగ్గురు ఖాన్లు కలిసి తీసే సినిమా ఏంటి? అసలు ముగ్గురు ఖాన్లు ఒక సినిమాలో చేస్తారా? పిచ్చి అభిమానం కాకపోతే, ఆయన అలా అనడమేంటి అభిమాను సంతోషపడడమేంటి?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ