బాహుబలి సినిమా విడుదలైన ఓ వారం పది రోజుల పాటు అభిమానుల హడావుడి ఓ రేంజ్ లో లేదు. ఈ అభిమానాన్ని వీరలెవెల్లో చాటుకోడానికి కొందరు బాహుబలి పోస్టర్ కు మేకపోతును బలిచ్చేశారు. ఈ వెర్రి చూసి కొందరు బిత్తరపోయారు. కానీ పేటా వారికి మాత్రం చాలి ఆగ్ర హం పుట్టుకొచ్చేసింది. ఈ మేకను బలి ఇచ్చిన అభిమానులను పట్టుకోవాలని పెటా ఇండియా పిలుపు ఇచ్చింది. అంతేకాదు వారి వివరాలు చెప్పిన వారికు 25 వేలు గిప్ట్ ఇస్తామని ప్రకటించింది. యానిమల్ రూల్ 2001 ప్రకారం అలా జంతుబలి చెయ్యరాదని మెన్షన్ చేసింది. వారు దొరికితే కనుక IPC 429 ప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెడతారట. ఈ సంఘటన వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగింది. ఎవరైనా ఈ వ్యక్తులను గుర్తుపడితే, వికారాబాద్ పోలీస్ ఇన్సిపెక్టర్ శ్రీ జి.రవి కి +919440627354 లేదా golluriravi@gmail.com కాంటాక్ట్ చేయాలని కోరరారు.