దక్షిణాదిలో ఎంతో బిజీగా వుండే నటి కాజల్ పీపుల్ ఫర్ ఎథిచల్ ట్రీట్మెంట్ అఫ్ యనిమల్స్(పేట) కి సపోర్ట్ చేస్తున్నారు. పేట భారతీయ సర్కస్‌లలో జంతువుల వినియోగం నిషేదించడం కోసం ప్రయత్నిస్తుంది. ఎవరో ఏనుగుని అంకుశంతో హింసిస్తున్న ఫోటో లో వున్న కాజల్ ఫోటో ఒకటి విడుదల చేసారు. ఈ ఫోటో జంతు హింస పై అందరిని ఆలోచింపచేసేలా వుంది. ఈ కాంపైన్ గురించి మాట్లాడుతూ ‘ఒక నటి గా నాకు నచ్చిన సినిమాలలో నటించే అవకాశం నాకు వుంది. అయితే జంతువులకి ఆ చాయిస్లేదు’ అని కాజల్ తెలిపింది. అంతేకాకుండా సర్కస్‌లలో జంతువులని హింసించడం ఆపాలని కాజల్ అందరినీ వేడుకుంది. గతంలో కూడా కొన్ని కంపెనీలు జంతువుల పై చేస్తున్న కాస్మెటిక్స్ ప్రయోగాన్ని ఆపాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ని వినతి చేసింది. ఫిలిం స్టార్స్ ఇలాంటి మంచి కారణం కోసం పాటుపడడం ఎంతైనా హర్షణీయం.