సెలబ్రిటీల ప్రతి కదలిక ఒక సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చునన్నట్టు. రీసెంట్ గా బయట పడ్డ పవన్ ఫొటో ఒకటి వెబ్సైట్లలో సంచలనం రేపుతోంది. ఎత్తుకున్నది బాబో, పాపో కూడా తెలియదు. ముద్దుగా, బొద్దుగా ఉన్న స్నేహితుల పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుని ఆడిస్తున్నాడేమో తెలియదు. కానీ పవన్ కు రెండవ కూతురంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఇది పాత ఫొటో లాగా ఉంది. ఆద్య కూడా అయి ఉండవచ్చునేమో కానీ, కాదని టీవీ ఛానెల్ లో వస్తున్న వంటల ప్రొగ్రాం స్పష్టం చేస్తుందంటున్నారు. పవన్ తన కూతురుతో ఆడుకుంటున్నాడనీ, అఖీరా, ఆద్యలతో పాటు మూడవ బిడ్డ అనీ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఈ విషయమై ఎప్పటి లాగానే ఏ మాత్రం స్పందించడం లేదు. అయినా ఆయన పర్సనల్ లైఫ్ పై ఎందుకో జనాల్లో ఇంత క్రేజ్ అర్థం కాదు కదా...