ఖాకీ డ్రెస్ శ్రీనువైట్లకు కలిసొచ్చే సెంటిమెంట్... ఎందుకంటే దూకుడు, ఆగడు, బాద్షా ల్లో హీరో పోలీసాఫీసర్లుగా కనిపిస్తారు. ఇందులో ఆగడు కలిసిరాకపోయినా... ఆయనకు పోలీస్ డ్రెస్ సెంటిమెంట్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ రాం చరణ్ కు మాత్రం ఈ డ్రెస్ కలిసొచ్చినట్టుగా అనిపించడం లేదు. ఎందుకంటే అతను చేసిన హిందీ చిత్రం జంజీర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆయన కెరీర్ లో చరణ్ ఫాన్స్ జంజీర్ ను లెక్క లోకి తీసుకోవడం లేదట. అయితే శ్రీనువైట్లకు పోలీస్ ఆఫీసర్ సెంటిమెంట్ కారణంగా ఇప్పుడు చరణ్ తో చేసే సినిమాలో ఆయనతో ఓ చోట పోలీస్ డ్రెస్ వేయంచాడట. ఈ సినిమాలో అతను నిజానికి స్టంట్ మ్యాన్ కానీ ఎందుకో ఏదో ఓ సీన్ లో చరణ్ చేత పోలీసు డ్రెస్ వేయించినట్టు సమాచారం. మరి ఈ సినిమా అయినా చరణ్ కు కలిసొస్తుందా? వైట్లకు లక్ అయితే, రాంచరణ్ కు కూడా లక్ తిరుగుతుందా? చూద్దాం...