పూజా హెగ్డే ప్రేమలో పడిందట....

June 05, 2015 | 05:16 PM | 0 Views
ప్రింట్ కామెంట్
Pooja_Hegde_Hrithik_Roshan_love_news_niharonline

హీరోయిన్ పూజా హెగ్డే మన తెలుగు వారికి బాగా తెలిసిన అమ్మాయి. ఈవిడ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయ. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? భార్యనుండి విడుకులు తీసుకున్న హృతిక్ రోషన్ అట. కోలీవుడ్ ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన పూజా, ఆ తర్వాత టాలీవుడ్‌కిలో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల్లో నటించింది. కన్నడ అమ్మాయి పూజీ హెగ్డే  ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ‘మొహంజదారో’ చిత్రం చేస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ సరసన ఆమె హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరు దగ్గరయ్యారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు గుజరాత్‌లో షూటింగ్ పూర్తికాగానే ఇద్దరు ముంబైకి జంటగా చెక్కేశారని టాక్. ఇటీవల భార్య నుంచి విడాకులు తీసుకుని దూరంగా వుంటున్నాడు హృతిక్. ఈ క్రమంలో హాలీవుడ్ నటితో ఆయన డేటింగ్‌లో వున్నాడనే వార్త కూడా ఉంది. ఇందులో నిజాలేమిటో కొన్నాళ్ళు ఆగితే గానీ తెలియదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ