ఈసారి వర్మగారి బుర్ర మ్యాగీపై మళ్ళింది... సహజంగా మ్యాగీ గురించిన చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఆయనకూ దీనిపై ఓ మాట రాయాలనిపించింది. వర్మ కామెంట్లు కొందరికి నచ్చితే, కొందరికి ఒళ్ళు మండి పోతుంది. ఎవరేమనుకున్నా ఆయనకు అనవసరం ఆయన మనసులో ఉన్న మాట ముక్కు సూటిగా చెప్పేస్తారు. అందులో వాస్తవాలు కూడా ఉండకపోవు... అయితే ఆయన ఏమంటున్నారంటే.... ఈ వివాదం మొదలైనప్పటి నుంచీ మరింత ఎక్కువగా మ్యాగీ తింటున్నానని ట్విటర్‌లో రాసుకున్నాడు... 'మ్యాగీ'కి మద్దతుగా రకరకాల ట్వీట్స్ వదిలాడు. ఆహార పదార్థాల్లో ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఇంగ్రేడియంట్స్ ఉంటాయని, మ్యాగీపై హఠాత్తుగా వివాదం ఎందుకు రేపారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతారు, వాటిపై లేని నిషేధం మ్యాగీపై ఎందుకు విధించారంటూ విమర్శించాడు. మ్యాగీపై వచ్చిన ఆరోపణలు వీగి పోతాయని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లు తర్వాత మేలుకున్న అధికారులు మ్యాగీ నూడూల్స్ ను పరీక్షించినట్టుగానే మిగతా క్యాడ్ బరీ, అమూల్, కోల్ గేట్‌నూ టెస్ట్ చేయాలని సూచించాడు. నిజంగానే ఆయన అన్నట్టు ప్రతి ఫుడ్ ప్రొడక్టు టెస్ట్ చేస్తే ఎందులో ఏ హానికర పదార్థాలున్నాయో తెలుస్తుంది కదా... కూల్ డ్రింకులు హానికరమని వార్తలు రాస్తున్నా... వాటికి పని చేస్తున్న వారు పెద్ద పెద్ద స్టార్లు కోట్లకు కోట్లు అర్జిస్తున్నారు. మరి వీటిపైనా నిషేధం ఎందుకు విధించడం లేదో అర్థం కావడం లేదు.