పోసాని కృష్ణ మురళి దాదాపుగా తెరమీద మాట్లాడినట్టే ఉంటుంది తెర వెనుక కూడా. అంత నిక్కచ్చిగా చెప్పేస్తాడు. తాను ఇండస్ట్రీకి డబ్బులు సంపాదించడానికే వచ్చాననీ, ఔదార్యంగా పని చేయడం తనకు చేతకాదని చెప్పుకొచ్చాడు. తను రైటర్ గా ఫీల్డులోకి ఎంటరయ్యాడు. ఆ తరువాత దర్శకుడిగా, అటు తరువాత నటుడిగా సెటిలై పోయాడు. ఇప్పుడు సినిమాల్లోకి ఎక్కువగానే బుక్ అయి పోతున్నాడు. అతను తెరమీద కనిపిస్తే అందరి పెదాలూ విచ్చుకుంటున్నాయి. పోసాని మార్కు హాస్యం, మాటల గారడీ, విలనీ లేదా మెంటల్ క్యారెక్టర్స్ ఏదైనా సరే తనకిచ్చిన క్యారెక్టర్ వాళ్ళకు నచ్చే విధంగా చేసి డబ్బు పుచ్చుకుంటాడట. తాజాగా రిలీజైన ‘టెంపర్’ సినిమాలో నటుడిగా ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు కూడా. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే... ఆయన అభిరుచి కోసం కాకుండా డబ్బుకోసమే ఇండస్ట్రీకి వచ్చాననడం. డబ్బిస్తే డైరెక్టర్ చెప్పినట్టుగా చేసి వెళ్ళిపోతానని నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. అంటే తీసుకున్నంతలో చేసిపెడతాడన్నట్టా? టెంపర్ కు ఎంత ముట్టిందో పోసానికి మరి.