నిజమేనట... ఈ ఇద్దరూ బాహుబలి 2 తరువాత పెళ్ళి చేసుకోబోతున్నారు. హెడ్డింగ్ చూసి ఏ మాత్రం కన్ ఫ్యూస్ కాకండి... ప్రభాస్ అనుష్కమెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడని... అనుష్క వరుడు వేరు... ఇటు ప్రభాస్ వధువు వేరు.
ఈ ఇద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారన్న సంగతి ఇంతకు ముందే వార్తల్లో వచ్చింది. ఈ ఇద్దరి పెళ్ళి బాహుబలి 2 తో ముడిపడి ఉంది. దర్శకుడు రాజమౌళి ఎంత తొందరగా బాహుబలి 2 ముగిస్తే వీరి పెళ్ళి అంత త్వరగా అయిపోతుంది.
అనుష్క పెళ్ళి విషయం ఓ కార్యక్రమంలో తెలిపింది. తాను ఎంపిక చేసుకున్న అబ్బాయి వారి కుటుంబానికి తగినట్టుగా ఉంటాడని.
ఇక ప్రభాస్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఒక ఇంజినీరింగ్ అమ్మాయిని చూసి పెట్టారనీ. ఈ హాండ్సమ్ హీరోకి తగిన జోడీ అని తెలిపారు.
అంటే వచ్చే సంవత్సరం ఈ స్టార్లిద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారన్నమాట.