బాహుబలి మాటేమో గానీ తన కెరీర్ లో ఏ హీరో చేయని త్యాగం చేశాడు ప్రభాస్. దాదాపుగా మూడేళ్లపాటు పూర్తిగా కాల్షీట్లను ఆ చిత్రానికి కేటాయించాడు. వచ్చే యేడు సీక్వెల్ తోపాటు వెరసి మొత్తం దాదాపు 4 ఏళ్లు ప్రభాస్ ఒకే చిత్రానికి పని చేస్తున్నాడన్న మాట. ఇదే నాలుగేళ్లలో వేరే ఏ పెద్ద హీరో అయినా సరే ఓ నాలుగు చిత్రాలతో దున్నేసుకునేవాడు. కానీ, రాజమౌళి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తిగా అంకిత భావంతో పనిచేసి అఖండ విజయంలో భాగస్వామి అయ్యాడు ప్రభాస్. ఇక మరో సంవత్సరం కూడా దాని సీక్వెల్ చిత్రానికి ఇచ్చేశాడు. అదేటైంలో పాపం ఇతర దర్శకులతో తన అప్ కమింగ్ సినిమాలపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు.
నిజానికి బాహుబలి అనుకున్న టైంకి రిలీజ్ అయి ఉంటే రన్ రాజా రన్ ఫేం సుజీత్ తో యూవీ బ్యానర్ లోనే ఓ చిత్రం తీద్దామని ప్రభాస్ అనుకున్నాడు. అయితే బాహుబలి లేట్ కావటం ఆపై సెలవుల్లో మునిగిపోవటంతో ఆ ప్రాజెక్ట్ మరుగున పడింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో సుజీత్ తో చిత్రం ఉంటుందని మాట ఇచ్చాడు ప్రభాస్. అది కూడా బాహుబలి 2 తర్వాత అనే. ఇక ఇప్పుడు మరో దర్శకుడితో కూడా చిత్రం తీస్తానని ప్రామిస్ చేశాడంట. జిల్ చిత్రంతో స్టైలిష్ దర్శకుడిగా పరిచయమైన కె.కె.రాధాకృష్ణ కుమార్ కి కూడా కథ రెడీ చేసుకోమంటూ ప్రభాస్ సంకేతాలు పంపాడట. దీంతో వేరే హీరోలతో కమిట్ కాకుండా తన కోసమేవెయిట్ చేస్తున్న సుజిత్ కు ప్రభాస్ హ్యాండిచ్చాడా అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. మరీ ఇద్దరిలో ఎవరికి ఓకే చెప్పినట్లో ఇప్పడు అర్థం కావట్లేదు. ప్లీజ్... కాస్త క్లారిటీ ఇవ్వవా డార్లింగ్!