ఓ వైపు దేశంతోపాటు యావత్ ప్రపంచం కూడా బాహుబలి గురించి గొప్పగా పొగుడుతుంటే ఓ జర్నలిస్టమ్మకి మాత్రం అస్సలు నచ్చలేదట. వెరైటీ పాయింట్ ను లెవనెత్తి ఇప్పుడు గొడవ గొడవ చేసి పారేస్తోంది. ఇంతకీ ఆమెకు నచ్చని పాయింట్ ఏంటంటే... శివుడు (యంగ్ ప్రభాస్), ఆవంతిక (తమన్నా) ల మధ్య వచ్చే రొమాన్స్. అసలు శివుడు ఆమెతో చేసింది రొమాన్స్ కాదట. బలవంతంగా ఆమెను రేప్ చేశాడట. అంతేకాదు సదరు జర్నలిస్టు గారు ఇందుకు సంబంధించి ఓ జాతీయ దినపత్రికలో ‘ది రేప్ ఆఫ్ అవంతిక’ పేరుతో ఓ ఆర్టికల్ రాసిపారేశారు. తనను ఫాలో చేస్తూ వస్తున్న వ్యక్తితో ఆవంతిక పోరాడుతుంటే... ఆవ్యక్తి(శివుడు) మాత్రం ఆమె వలువలు ఒక్కోక్కటి విప్పుతూ ఆమెలోని అందాన్ని ఆమెకే చూపించడం అసలు కరక్టెనా అని ఆమె ప్రశ్నించింది. అంతేకాదు అప్పటిదాకా సీరియస్ గా ఉన్న వాళ్లు ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయి శృంగారంలో పాల్గొన్నట్లు చూపడం ఎంత వరకు కరెక్టని ఆమె రాసింది. అది ఖచ్ఛితంగా బలవంతపు శృంగారమే అని, నిర్మోహమాటంగా అత్యాచారమే (రేప్) అవుతుందని పేర్కొంది. చివర్లో అంటే ఆడాళ్లు అంత వీకా అని రాజమౌళికి ఓ ప్రశ్నను సంధించింది. ఇప్పడీ వ్యాసం ఆన్ లైన్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మరి దీనిపై జక్కన్న ఎలా స్పందిస్తాడో ?