బాహుబలి రెండో పార్ట్ కోసం ప్రపంచమంతా ఆత్రుతతో ఎదురుచూస్తుండగా, షూటింగ్ మొదలయ్యే తేదీని అనౌన్స్ చేశారు ఆ చిత్ర టీం. దీంతో ఆ చిత్ర నటీనటులంతా వారి వారి బాడీ లాంగ్వేజ్ లోకి మారిపోతున్నారు. కాస్త గ్యాప్ దొరకటంతో నార్మల్ గా వారి వారి రూపాల్లోకి మారిపోయిన చిత్ర బృందం ఆయా పాత్రలోకి తిరిగి పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమైపోతుంది. ఇక ప్రధాన పాత్రధారి ప్రభాస్ కూడా ఫాంలోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు.
సహజంగానే మంచి ఎత్తు, అందుకు తగిన ఆకర్షణీయమైన పర్సనాలిటీతో కనిపిస్తాడు. అలాంటి ప్రభాస్ బాహుబలి సినిమా కోసం మరింత కండలు పెంచాడు. తిండి విషయంలో నిష్ట పాటించాడు. వందకు పైగా బరువు పెరిగిపోయాడు. అందువలన బాహుబలి గా ఆయనని తెరపై చూసిన ప్రేక్షకులు, ఆ పాత్రకి ఆయన సరిగ్గా సరిపోయాడని అనుకున్నారు. ఈ సినిమా విడుదలై విజయవిహారం చేయడంతో, ఆయన హాయిగా హాలీడేస్ ను ఎంజాయ్ చేశాడు.
ఇక బాహుబలి 2'కి రంగం సిద్ధమవుతూ ఉండటంతో, ఆయన మళ్లీ వర్కౌట్స్ మొదలుపెట్టాడు. కండలు పెంచడం పైనే దృష్టి పెట్టి ఆ కసరత్తును పూర్తిచేశాడు. ప్రభాస్ ఇప్పుడు మరింత బలంగా, ధృడంగా కనిపిస్తున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త బ్యాలెన్స్ ఉండటంతో ఆయన భారీ శరీరాకృతి బాహుబలి 2కి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వచ్చేనెల 14న ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగుకి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నారు.